ఆమె బాస్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు
టెక్సాస్ కాల్పుల్లో మరణించిన తెలంగాణ ఇంజినీర్ ఐశ్వర్య తాటికొండ గురించి.. ఆమె పని చేసే కంపెనీ బాస్ కీలక విషయాలు పంచుకున్నారు. 27 ఏళ్ల ఐశ్వర్యకు.. కంపెనీకి సీఈవో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఆమెను త్వరలోనే సీఈవో చేయాలని ప్లాన్ చేశామని.. ఆమె పనిచేస్తున్న సంస్థ పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ LLC ప్రెసిడెంట్ శ్రీనివాస్ చలువాది ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. సివిల్ ఇంజినీర్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐశ్వర్య.. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో నిర్మాణ సంస్థలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరింది. అయితే.. ఐశ్వర్య తన పనిలో సమర్థంగా పనిచేస్తుందనీ.. డల్లాస్‌లో ఇల్లు కొని స్థిరపడాలనే ఆలోచన కూడా ఐశ్వర్యకు ఉండేదని తెలిపారు.
“ఐశ్వర్య నాకు కూతురు లాంటిది. మా ఆఫీసులోని ఆమె క్యాబిన్ వద్ద.. మా ఎంప్లాయిస్ సంతాపం వ్యక్తం చేయడానికి పుష్పగుచ్ఛాలు పంపుతున్నారు. ఐశ్వర్య క్యాబిన్‌లో శాశ్వత స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.” అని శ్రీనివాస్ తెలిపారు.