గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం పారిశుద్య కార్మికున్ని మ్యాన్ హోల్ లోకి దింపిన ఘటనపై అధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేయర్,కమిషనర్ లు.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.సంబంధిత శానిటరీ ఇన్స్ పెక్టర్ భాస్కర్,జవాన్ రవి లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్, ఇంఛార్జి కమీషనర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. డ్రైనేజీలోకి దిగి వ్యర్థాలను చేతులతో తొలగించడం విచారకరమని..ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. GWMC వ్యాప్తంగా అత్యాధునిక పారిశుద్ధ్య విధానాలు అవలంబిస్తున్నామని .. కార్మికులతో ఇలాంటి అమానవీయ పనులు చేయించడానికి వీలు లేదని తేల్చిచెప్పారు.