టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస చేసిన వ్యాఖ్యలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటలో వైకుంఠధామం ప్రారంభోత్సవంలో పాల్గొన్న తలసాని.. రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాడు వీడు అంటూ సంబోధిస్తూ ఉగ్రరూపం చూపించారు. తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ లీడర్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రికి కౌంటరిచ్చారు బలమూరి వెంకట్.
మంత్రి శ్రీనివాస్ యాదవ్ ‘ఏనాడైనా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే గుట్కాలు బుక్కుకుంటు ఎక్కడో ఉన్నావు’ అంటూ విమర్శించారు. యువతకు భరోసా కల్పించకుండా మోసం చేసినందుకు యువత పోరాటం చేస్తుందని తెలిపారు. పేపర్ లీక్ లను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకులను తిడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.కేటీఆర్, తలసాని ఎక్కడికి వెళ్లినా.. అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. వెంటనే తలసాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.