ఇంటర్మీడియట్ పరీక్షల్లో 600/600 మార్కులు సాధించిన విద్యార్థినికి రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచింది. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాకు చెందిన నందిని..పన్నెండో తరగతి పరీక్షల్లో తన ప్రతిభతో స్టేట్ టాపర్ గా నిలిచింది. నేడు ఉదయం నందిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెన్నై లోని క్యాంపు కార్యాలయంలో సీఎం స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ విద్యార్థి నందినిని సత్కరించి.. ఉన్నత చదువులకు ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.