మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భూత్పూర్ మున్సిపాలిటీకి చెందిన బజారు ఆనంద్, అతని సోదరి నాగమణి, లక్ష్మమ్మ కలిసి బైక్ పై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఆసుపత్రికి వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నానికి తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో.. హై స్కూల్ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.