AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రైవేటుకు ధీటుగా టీఎస్ఆర్టీసీ ఆస్పత్రి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి సంస్థ పెద్ద పీట వేస్తోంది.కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తార్నాక ఆస్పత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించింది. ఇక్కడ కొత్తగా నిర్మించిన 4 సూపర్ స్పెషాలిటీ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు 15 బెడ్ల మెడికల్, 10 బెడ్ల సర్జికల్ ఐసీయూలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాలను పరిశీలించారు. ఐసీయూల్లో ఆర్టీసీ సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సంస్థ అయినా బాగుంటందని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఈ మేరకు సిబ్బంది ఆరోగ్య సంక్షేమంపై సంస్థ ప్ర‌త్యేక దృష్టిసారించిందని సజ్జనార్ చెప్పారు.కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిని రూపుదిద్దామని పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన 4 సూపర్ స్పెషాలిటీ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించామని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మద్దతుతో 25 ఐసీయూ బెడ్లు, వాటికి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నామని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10