సనత్ నగర్ లో రసాయనాలు ఉపయోగించి మామిడి కాయలను మగ్గపెడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పిట్టల బస్తీ ప్రాంతంలోని శక్తి రాజు మ్యాంగోస్ ఫుడ్ఇంగ్ మరియు ఫతేనగర్ అగర్వాల్ కమర్షియల్ కంపెనీలో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు.. 50కేజీల కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కార్బిడే కెమికల్ వేసి మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 48 బాక్సుల్లో 960 కిలోల మామిడిపళ్ళను సీజ్ చేశారు.సహజ సిద్ధంగా వచ్చే మామిడి పండ్లకు బదులు, రసాయనాలు ఉపయోగించి మగ్గించిన పండ్లను తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు.