AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలోనే అతి పొడవైన అండర్‌గ్రౌండ్ మెట్రో..

నిర్మిస్తున్న ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్
దేశంలో అతి పొడవైన భూగర్భ మెట్రో త్వరలో ముంబైలో ప్రారంభం కానుంది. అక్టోబర్ నాటికి ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భూగర్భ మెట్రో ప్రాజెక్ట్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ముంబయి నగరంలోని శివారు ప్రాంతాలను దాని ద్వీప నగరంతో అనుసంధానించే ఏకైక మెట్రో కారిడార్ ఇది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో పనుల్లో భాగంగా కొలాబా – బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) మధ్య కారిడార్‌ను డిసెంబరు నాటికి పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ లేదా ఆ తర్వాత మూడు నెలల లోపు ప్రయాణికుల కోసం ఎప్పుడైనా దీన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు:
✦ BKC మెట్రో కారిడార్.. ముంబై నగరంలోని కీలక ఆర్థిక జిల్లాకు కనెక్టివిటీని అందిస్తుంది.
✦ ముంబై విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్‌లతో అనుసంధానం చేస్తుంది.
✦ ఈ మొత్తం కారిడార్ పొడవు 33 కి.మీ. (రెండు దశలు కలిపి). ఇందులో భూగర్భ కారిడార్ కీలకం.
✦ ఫేజ్ I (BKC-Aarey)లో తొమ్మిది స్టేషన్లు వస్తాయి. MIDC, అంధేరీ (తూర్పు), BKC, ఎయిర్‌పోర్టు లాంటి కీలక స్టేషన్లు ఈ కారిడార్‌లో వస్తాయి. 12 కి.మీ. పొడవైన ఈ మార్గంలో ప్రయాణ సమయం 25 నిమిషాలు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10