ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయాలతో ఆ జట్టుకు దూరం అయ్యాడు. ఈ సీజన్‌లోని మిగితా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం లేదు. దీనిపై ముంబై ఇండియన్స్ ఓ ట్వీట్ చేసింది. ఆర్చర్ స్వదేశానికి వెళ్తున్నట్లు పేర్కొన్నది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఎంఐ జట్టు రెండు కోట్లు పెట్టి ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ టోర్నిలో అర్చర్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు..