పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను పారామిలిటరీ దళాలు అరెస్ట్ చేశాయి. ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఆయన్ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.తిరుగుబాటు, హత్యాయత్నం కేసులకు సంబంధించిన విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు ఇమ్రాన్ హాజరయ్యారు. తనపై పలు ఎఫ్ఐఆర్ లు నమోదైన నేపథ్యంలో.. బెయిల్ కోసం వెళ్లారు. ఈ సమయంలో ఇమ్రాన్ ను రేంజర్లు అరెస్టు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. అవినీతి కేసులో విచారణ జరుగుతుండగానే ఆయన్ను ఇలా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇమ్రాన్ ను అరెస్టు చేసే సమయంలో కోర్టులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.