AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మస్క్ కీలక ప్రకటన.. ఆ ట్విట్టర్ ఖాతాల తొలగింపు..

దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇది కూడా ట్విట్టర్‌కు సంబంధించినదే. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ సీఈఓ, సీఓఓలను తొలగించారు. ట్విట్టర్ లీగల్ హెడ్‌ను కూడా తీసేశారు. తర్వాత పెద్ద ఎత్తున లేఆఫ్స్ కూడా ప్రకటించారు. మరోవైపు.. ఉద్యోగులకు టార్గెట్స్ పెట్టి.. ఎక్కువ సమయం పనిచేయాలని ఆదేశించారు. దీంతో అంతా ఆ మధ్య గందరగోళం నెలకొంది. మరోవైపు ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను రూపొందించి.. డెడ్‌లైన్ విధించి ఆలోగా తీసుకురావాలని ఉద్యోగులకు గడువు విధించారు. దీంతో సామూహికంగా చాలా మంది ఉద్యోగులు తప్పుకున్నారు.

ఇక అయినా తగ్గని మస్క్.. తన పని తాను చేసుకుంటూ పోయారు. కొన్ని విషయాల్లో వెనుకడుగు వేసినా.. ఇంకొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా యాక్టివిటీలో లేని ట్విట్టర్ అకౌంట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రోజు ఈ మేరకు మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఇలా ట్విట్టర్ అకౌంట్ల తొలగింపుతో చాలా మంది ట్విట్టర్ ఫాలోవర్లు కూడా తగ్గే అవకాశముందని ఆయన వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10