సిపిఐ నేత నారాయణ
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సిపిఐ నేత నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ నుంచి బయటకొచ్చిన మరుక్షణమే జగన్ జైలు కెళ్తారన్నారు. ప్రధాని మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని నారాయణ విమర్శించారు. మోదీ దత్త పుత్రులే దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రయోజనాలకు బిజెపి గండికొడుతున్న జగన్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవడంలేదని నారాయణ అడిగారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావన్నారు.