ఎలక్షన్ లకు ఇంకా టైం ఉండగానే తెలంగాణలో టికెట్ల గోల మొదలైంది.ఇటీవల ఎమ్మెల్యే టీ.రాజయ్య .. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనకేనని ప్రకటించుకోగా.. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా టికెట్ కేటాయింపులపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే అని.. ఖైరతాబాద్ తనదేనని ప్రకటించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ విషయం సీఎం కేసీఆర్ కు కూడా తెలసుని.. ఎవరెవరో ఏదోదో మాట్లాడుకుంటారని.. అవన్నీ తన దగ్గర నడవవని చెప్పారు. అయితే ఖైరతాబాద్ నుంచి 2018లో పోటీ చేసిన దాసోజు శ్రవణ్ ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దానం వ్యాఖ్యలు దుమారం రేపాయి.