జగిత్యాల పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన తండ్రి కోసం బయటకు వెళ్లిన కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్,పద్మిణీలకు ఒక కుమారుడున్నాడు.మోహన్ పదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి తీసుకువచ్చారు.అయితే తమ ఇంట్లో తాగునీరు అయిపోవడంతో మోహన్ కుమారుడు శివకార్తీక్ నీళ్లు తీసుకొస్తానని బైక్ పై బయటకు వెళ్లాడు. దారిలో దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.శివకార్తీక్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.