AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు.ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలదే పైచేయి. 9.5లక్షల మంది పరీక్షలు రాయగా.. 63.85 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. మొదటి సంవత్సరంలో 61.68 శాతం మంది, రెండో సంవత్సరంలో 63.49 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో లక్షా 60 వేల మందికి, సెకండ్ ఇయర్‌లో లక్షా 73 వేల మందికి ఏ గ్రేడ్ సాధించినట్టు చెప్పారు.

అదేవిదంగా ఫస్టియర్‌లో బాలికల 68.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 54.66 ఉత్తీర్ణత శాతం సాధించారు. సెకండియర్‌లో బాలికల 71.57శాతం .. బాలురు 55.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.రేపటి నుంచి రీ కౌంటింగ్‌, రీవాల్యూయేషన్‌కు అవకాశం కల్పించనున్నారు.ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్‌ 4 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి తెలిపారు.ఇదిలా ఉండగా ఎంసెట్ లో ఇంటర్మీడియెట్ వెయిటేజీ ఎత్తివేస్తున్నట్టు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10