జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదారాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ముత్తిరెడ్డిపై సొంత కూతురు తుల్జా భవాని రెడ్డి కంప్లైంట్ చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవాని రెడ్డి ఆరోపణలు చేశారు. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. గతంలో ఈ భూమిపై తీవ్ర వివాదం చెలరేగింది.
చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆయన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో ఆ భూ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే.. ముత్తిరెడ్డిపై సొంత కూతురే ఇలా ఫిర్యాదు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏమైనా.. కుటుంబ కక్షలున్నాయా..? లేదా రాజకీయపరంగా బేధాభిప్రాయాలు వచ్చాయా..? లేదా ఇంకేవైనా కారణాలున్నాయా..? అనేదానిపై చర్చించుకుంటున్నారు.