టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్, ఏఈ, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పేపర్లు కూడా విక్రయించినట్టు బయటపడింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్‌లపై సిట్ భిన్న కోణాలలో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు తెలిశాయి.
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన మనోజ్‌కు విక్రయించినట్టు గుర్తించి, ఆ ఇద్దరిని సిట్ సోమవారం అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు దళారులుగా వ్యవహరించి పేపర్లను పరీక్ష రాసే మరికొందరికి విక్రయించినట్టు తేలడంతో, కొనుగోలు చేసినవారి గురించి సిట్ గాలిస్తున్నది.