ఇంటర్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో మంత్రి విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. ఫలితాలను https://tsbie. cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చన్నారు.