చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.క్యాసినో కేసులో గతంలో ఈడీ చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించింది.థాయ్ లాండ్ ఘటనతో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.చికోటితో పాటు చిట్టి దేవేందర్,సంపత్,మాధవరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.ఈ నెల 12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ రానున్నారు. వచ్చే వారం ఈడీ ఎదుట చికోటి హాజరు కానున్నారు. థాయ్ లాండ్ ఘటన అనంతరం చికోటిని ఈడీ అడిగే ప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది.కాగా థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ కేసులో పోలీసులు చికోటిని అరెస్ట్ చేశారు. ఘటనా సమయంలో నగదు, గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజు బెయిల్ మీద బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే ఈడీ నోటీసులు ఇవ్వడం ఇంట్రస్టింగ్ గా మారింది.