AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కు అమ్ముడుపోయిన సీనియర్లు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ కు చెందిన సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారని, అందుకే కొత్త తరం నేతలకు పార్టీని నడిపించే అవకాశాలు వస్తున్నాయని రేవంత్ అన్నారు. తనలాంటి యువ నాయకుడికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేతగా అవకాశం వచ్చిందన్నారు. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం మానేశామని.. సీఎంను ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోవడం మానేశారంటూ వ్యాఖ్యానించారు. సీట్ల వారీగా సర్వే చేయడం లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రజల మూడ్ పై సర్వే జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 32 నుంచి 34 శాతం ఓట్లతో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మరో 5 శాతం ఓట్లు రావాల్సి ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మరింత సహకారం అందించి పార్టీని బలోపేతం చేయాలని యువనేతలను రేవంత్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో యువకులను బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లనున్నట్టు అర్థమవుతోంది. సీనియర్లు తనకు అడ్డుపుల్లలు వేస్తూ ఎదగనీయకపోవడంతో వారిని పూర్తిగా పార్టీకి దూరం చేయాలని రేవంత్ భావిస్తున్నాడు. ఇక కేసీఆర్ కోవర్టులుగా ఉండి కాంగ్రెస్ ను దెబ్బతీస్తున్న వారిని తాజాగా నేరుగా గురిపెట్టారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ కు దిగారు. యువతను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లకు కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికాడు రేవంత్ రెడ్డి. ఎవరు మంచి నేతలు వచ్చినా చేర్చుకుంటామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు 25 సీట్లు బీజేపీకి 8 సీట్లు వస్తాయని.. 38శాతం ఓట్లతో కాంగ్రెస్ పక్కాగా అధికారంలోకి వస్తుందంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10