AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో నీట్‌ పరీక్ష వాయిదా…

రేపు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షల జరుగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ (యూజీ) – 2023 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్‌ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్‌ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యా, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

మణిపూర్‌లో ఓ వర్గానికి ఎస్టీ హోదా కల్పించడాన్ని నిరసిస్తూ అక్కడి గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు, నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌ పరీక్షా కేంద్రాల్లో నీట్‌ పరీక్షను రద్దు చేశారు. సమాచారాన్ని అభ్యర్థులకు ఆటో కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా చేరవేసినట్లు తెలిపారు. కాగా, దేశంలోని వైద్య విద్యా కోర్సులు పదింటిలో ప్రవేశం కోసం ఏన్టీఏ ప్రతి ఏటా కట్టుదిట్టంగా నీట్‌ పరీక్ష నిర్వహిస్తుంది. పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. మణిపూర్‌ మినహా దేశవ్యాప్తంగా రేపు మధ్యాహ్న 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలకు నాలుగేసి మార్కుల చొప్పున 720 మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్‌ మార్క్‌ ఉంటుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10