భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పెళ్లి బస్సు బీబత్సం సృష్టించింది. మణుగూరుకి పెళ్లి బృందంతో వస్తున్న బస్సు.. హనుమాన్ టెంపుల్ ఏరియాలో టూవీలర్ పార్క్ చేసేందుకు వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో టీవీఎస్ పై ఉన్న భార్య సోమలక్ష్మీ అక్కడిక్కడే మరణించగా.. ఆమె భర్త వెంకటరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరాములును స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాజపేట గ్రామానికి చెందిన సోమలక్ష్మీ.. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.