ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్ లో విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ సభ నిర్వహణకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.ఈ మేరకు రేపు మధ్నాహ్నం గాంధీభవన్ లో టీపీసీసీ పీఈసీ సమావేశం జరగనుంది.ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు NSUI, యూత్ కాంగ్రెస్ లతో పాటు అనుబంధ సంఘాల చైర్మన్ లతో సమావేశకానున్నారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరుకానున్న బహిరంగ సభ విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సన్నాహకాలు చేస్తుంది.