న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ మే 15వతేదీ వరకు విమాన టిక్కెట్ల అమ్మకాలను రద్దు చేసింది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్ రిఫండ్ ఇవ్వడం, లేదా తరువాతి రోజులకు బుకింగ్ మార్చడం వంటి చర్యలు చేపట్టినట్లు డిజిసిఎ గురువారం తెలిపింది.
మే 3 తేదీ నుంచి విమాన సర్వీసులను మూడు రోజులపాటు రద్దు చేయాలని గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ హఠాత్తుగా నిర్ణయించడంతో దానికి డిజిసిఎ షోకాజ్ నోటీసు జారీచేసింది. మే 15వ తేదీ వరకు టిక్కెట్ల అమ్మకలు రద్దు చేసినట్లు గో ఫస్ట్ తెలియచేయడంతో ప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు వాపసు చేయడం లేదా భవిష్యత్ తేదీలకు బుకింగ్ మార్చడం చేస్తున్నట్లు డిజిసిఎ ఒక ప్రకటనలో తెలిపింది.