తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోన్న త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. | తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు కావొస్తోన్న ఇప్పటికీ చిన్న పిల్లలా కనిపిస్తుంది తమన్నా. అది కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం. ఈ రేంజ్ పోటీలో కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ భాటియా బేబీ. ఈమె కెరీర్లో హీరోయిన్గా నటిస్తూనే పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించింది. తాజాగా ఈ భామ ఓ సీనియర్ హీరో సరసన ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
మిల్కీ అందం తమన్నా.. గత కొన్నేళ్లుగా విజయ్ వర్మ అనే నటుడితో రిలేషన్లో ఉందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లినా.. జంటగానే దర్శనమిస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు ముంబైలో జంటగా దర్శనమిచ్చారు. దీంతో కెమెరా కళ్లన్ని ఈ జంటపైనే ఉన్నాయి.