పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం.. బండిసంజయ్
మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ (Bandi Sanjay) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలనను వ్యతిరేకించే వాళ్లంతా బీజేపీలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ధైర్యమున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు.
ఈటల సహా బీజేపీలో అందరి లక్ష్యం ఒక్కటే అని అన్నారు. వాళ్లు పొంగులేటిని కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీ శక్తివంతమైన పార్టీ అని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ పట్ల నమ్మకంతో ఉన్నారన్నారు. జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సమ్మెకు బండి సంజయ్ సంఘీభావం తెలియజేశారు. మండుటెండలో సమ్మె చేస్తున్నా మానవత్వం లేదా అని ప్రశ్నించారు. సమ్మె చేయడానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. జేపీఎస్‌లకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు. జేపీఎస్‌లను సస్పెండ్ చేస్తే తాముు రోడ్డెక్కుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.