ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శ్రీశైలం పరిసరాల్లో గుర్తు తెలియని విమానం కలకలం సృష్టిస్తుంది. విమానం శ్రీశైలం క్షేత్రం చుట్టూ చక్కర్లు కొట్టడంతో భక్తులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలలో శ్రీశైలం ఆలయ పరిసరాల్లో పలుమార్లు ఆకాశంలో డ్రోన్ తిరిగినా ఇంతవరకు దాని ఆచూకీ దొరకలేదు. ఆలయంపై పోలీసులు నిఘా పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విమానం ఎక్కడ నుంచి వచ్చిందనే ఆరా తీస్తే బాగుంటుందని స్థానికులు వాపోతున్నారు.