AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మర్చిపోలేని మధుర జ్ఞాపకం..

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్ , సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి , స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తో పాటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్ర యూనిట్‌కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కు బండి సంజయ్ శుభాకంక్షలు తెలియజేశారు.

కాగా.. లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ వేడుక లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10