మంత్రి హరీశ్ వెల్లడి
హైదరాబాద్: ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి.. సీనియర్లు అయ్యాక కూడా ర్యాగింగ్ గురించి ఆలోచన చేయటం సరైంది కాదన్నారు. వైద్య వృత్తిలో ఉన్నవారు నిపుణులుగా తయారై.. పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని.., రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఉప్పుడు ఆ సంఖ్య 17కు చేరిందని అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.