తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమైంది. నూతన ఫైళ్లపై సంతకాలు చేసిన అనంతరం మంత్రులకు ఛాంబర్ లు కేటాయించారు. మంత్రి హరీష్ రావు తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి ఫైలుపై సంతకం చేశారు. అంతకు ముందు హరీష్ రావు సీఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే పలువురు మంత్రులు వారికి కేటాయించిన ఛాంబర్ లలో ఆశీసులైనారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్) శాంత కుమారి కూడా తన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులయ్యారు. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో రూపుద్దిద్దుకుని కేక పుట్టించేలా ఉన్న ఈ సచివాలయంలో ఏ ఫోర్లో ఏ శాఖా మంత్రులు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లోర్ల వారీగా మంత్రులు..
గ్రౌండ్ ఫ్లోర్: కొప్పుల ఈశ్వర్ (A వింగ్), మల్లారెడ్డి (B వింగ్)
ఫస్ట్ ఫ్లోర్: మహమూద్ అలీ (A వింగ్), సబితా ఇంద్రారెడ్డి (B వింగ్), ఎర్రబెల్లి (D వింగ్)
సెకండ్ ఫ్లోర్: హరీష్రావు (A వింగ్), జగదీష్ రెడ్డి (B వింగ్), తలసాని శ్రీనివాస్ (D వింగ్)
థర్డ్ ఫ్లోర్: కేటీఆర్ (A వింగ్), సత్యవతి రాథోడ్ (B వింగ్), నిరంజన్ రెడ్డి (D వింగ్)
ఫోర్త్ ఫ్లోర్: ఇంద్రకరణ్ రెడ్డి (A వింగ్), శ్రీనివాస్ గౌడ్ (B వింగ్), గంగుల కమలాకర్ (D వింగ్)
ఫిఫ్త్ ఫ్లోర్: ప్రశాంత్ రెడ్డి (A వింగ్), పువ్వాడ అజయ్ (D వింగ్)
సిక్స్త్ ఫ్లోర్: సీఎం కేసీఆర్, సీఎంఓ
అంతస్తుల వారీగా శాఖల వివరాలు..
గ్రౌండ్ ఫ్లోర్: ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు
మొదటి అంతస్తు: హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్ శాఖలు
2వ అంతస్తు: వైద్యారోగ్యం, విద్యుత్, సెకండ్ ఫ్లోర్, పశు సంవర్ధక, ఆర్థిక శాఖలు
3వ అంతస్తు: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు
4వ అంతస్తు: పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు.
5వ అంతస్తు: రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు.
6వ అంతస్తు: సీఎం కార్యాలయం, సీఎం పేషీ, కార్యదర్శులు