ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలోని ఎంఎల్‌ఎ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫొటోపై జెసి ప్రభాకర్ రెడ్డి ముద్దుల వర్షం కురిపించారు.
డీజిల్ దొంగ ఎవరో? తేల్చాలని, ప్రజల సొమ్ము దోచుకున్న గజదొంగ కేతిరెడ్డి అని, ప్రజల మనసు దోచుకున్న గజదొంగను తాను అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన గుండె తాడిపత్రి అంటుందంటూ షర్టు విప్పి జెసి చూపించారు. ఫ్లెక్సీలు తాను కూడా కడతానని, గజదొంగ ఎవరో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఎంఎల్‌ఎ కేతిరెడ్డికి ఒక సంవత్సరం మాత్రమే ఉందని, ఏం తింటావో తిను అని మండిపడ్డారు.