తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా మెరిసిపోతున్న నూతన సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం కొనసాగుతోంది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు.
ఉదయం 5.50 గంటలకు రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15నిమిషాలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలోని వేర్వేరు చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటారు.
మధ్యాహ్నం 1.20 గం.లకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆరో ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లోని కుర్చీలో ఆసీనులవుతారు. మరోవైపు సచివాలయం పరిసరాల్లో 650మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం జీఏడీ పాస్‌లు ఉన్న ఉద్యోగుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.