జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మొగిల్ రావులో భర్తను భార్య హత్య చేసింది. భర్త మంద దేవ రాజును(35) భార్య అలివేలు గొడ్డలితో నరికి చంపింది. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్ధిక సంబంధమైనా గొడవలా? లేక వివాహేతర సంబంధమైన గొడవలు జరుగుతున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.