AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం నేడే

పూజలు, క్రతువులతో కోలాహలంగా సచివాలయ ప్రాంగణం..
ధవళకాంతుల ధగధగలతో మెరిసిపోతున్న తెలంగాణ సరికొత్త పాలనా సౌధం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సకల సదుపాయలతో, ఆధునిక హంగులతో నిర్మితమైన కొత్త సచివాలయం నేడు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు త‌మ‌కు కేటాయించిన చాంబ‌ర్లలో ఆశీనులు కానున్నారు.

భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం.. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని.. దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో.. అద్భుత కట్టడం. ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల చేశారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత నూతన సమీకృత సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసిన వెంటనే 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు. సచివాలాయాన్ని ప్రారంభించిన వెంటనే సీఎం కేసీఆర్ కార్యకలాపాలను ప్రారంభిస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10