తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలకోసం ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు మెుదటగా వెల్లడించాయి. అయితే ఆయన ఉదయం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం ఆసుపత్రి వర్గాలు పూర్తి వివరాలు వెల్లడించనున్నాయి.
అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఆమెకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. శోభ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి కేసీఆర్ తెలుసుకుంటున్నారు.