తన ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది హీరోయిన్ శృతిహాసన్.. ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఎఫైర్ లో ఉంది . ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. శాంతను గురించి కూడా శృతి సమాజానికి చెప్పేశారు. అయితే ఏనాడూ బాయ్ ఫ్రెండ్ అని ప్రకటించలేదు. అతనితో సన్నిహితంగా ఉంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. శాంతనుతో తన హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో నేరుగా పంచుకుంటారు. తాజాగా శృతి ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఒక వీడియో చేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.పెళ్లి కాకుండా రొమాన్స్ చేయడం ఇండియన్ సొసైటీ తప్పుగా చూస్తుంది. అలాంటిది, నలుగురికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అతి పెద్ద సాహసం. మరి శృతి హాసన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.