కడప : వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కోసం కడప కేంద్ర కారాగారంలోని సిబిఐ క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణ అధికారి లేకపోవడంలో కొద్దిసేపటికి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ అధికారి లేని కారణంగా తిరిగి వెళుతున్నానని మీడియాతో మాట్లాడారు. మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు, నోటీసు ఇచ్చాక విచారణకు వస్తానని తెలిపారు. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతా అన్నారు. నాకు ఆరోగ్యం బాగాలేకున్నా హాజరయ్యారని తెలిపారు. నేను మాట్లాడేందుకు ఏమీ లేదు, అంతా ఎంపీ వైఎస్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారని మాట్లాడుతూనే వివేకా కేసులో సూసైడ్ లెటర్ గా చెపుతున్న లెటర్ ఎందుకు వెలుగులోకి రాలేదని ప్రశ్నించారు. ఆ లెటర్ ఎందుకు బయటకు రాలేదో అర్థం కావడం లేదని మాట్లాడారు. సిబిఐ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వైఎస్ భాస్కర్ అన్నారు.