స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎదురుదెబ్బ.. ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఓ మహిళా సర్పంచ్ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె వ్యాఖ్యల ఆధారంగా మహిళా కమిషన్ సుమోటాగా కేసును పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో రాజయ్యపై మహిళా సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు నిజమా? లేదా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి లేఖ రాశారు. ఒకవేళ సర్పంచ్ ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే రాజయ్యపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కమీషన్ భావిస్తున్నట్టు సమాచారం.