AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన కవిత దీక్ష..

ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు జాతీయ మహిళల సమస్య అని, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ సమస్య కాదని కవిత అన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన అంశం కాదని, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. దీని కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కవిత అన్నారు.

మరోవైపు… కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED)కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10