AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గౌతమ్ అదానీపై అమెరికా ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదు.. అదానీ గ్రూప్ స్పష్టీకరణ

అదానీ గ్రూప్ కంపెనీ చైర్మెన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అమెరికా న్యాయ శాక (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్) స్పష్టం చేసిందని అదానీ గ్రూప్ కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

అదానీలు అధికారులకు లంచాలు ఆఫర్ చేశారని మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు అదాపీ గ్రూప్ లో భాగమైన అదానీ గ్రీన్ కంపెనీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ తాజా ఫైలింగ్ లో పేర్కొంది. “మిస్టర్ గౌతమ్ అదానీ, మిస్టర్ సాగర్ అదానీ, మిస్టర్ వినీత్ జైన్ లపై ఉన్న ఆరోపణల్లో ఎఫ్‌సిపిఏ చట్ట (విదేశాల్లో అవినీతి చర్యల చట్టం) నిబంధనలు ఉల్లంఘించినట్లు లేదు అని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపాయి” అని అదానీ గ్రీన్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

అదానీ గ్రూప్ డైరెక్టర్లు అయిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ లపై అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ లో అయిదు ఆరోపణలు ఉన్నట్లు మీడియా తెలిపింది. అయితే వీటిలో రెండు ఆరోపణలు విదేశాల్లో అవినీతి చర్యల చట్ట నిబంధనలు ఉల్లంఘించడం (అవినీతి, లంచం ఇవ్వడం), న్యాయ విచారణకు అడ్డుపడడం వంటి ఆరోపణలు లేవని అదానీ గ్రూప్ తెలిపింది. తప్పుడు ప్రచారం వల్ల అదానీ గ్రూప్ నకు చెందిన 11 కంపెనీలకు మొత్తం 55 బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. దీనివల్ల తమ పెట్టుబడిదారులు, షేర్ హోల్డర్లు నష్టపోయారని, తమ కంపెనీల అంతర్జాతీయ ప్రాజెక్టులు రద్దు అయ్యాయని తెలిపింది.

మరోవైపు అదానీలపై అంతర్జాతీయ, భారత మీడియా తప్పుడు ప్రచారం చేశాయని.. ఇదంతా అమెరికా కోర్టులో నమోదైన ఆరోపణలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే జరిగిందని భారత మాజీ అటార్నీ జెనెరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10