వైస్ ఛైర్మన్ గా సావాపూర్ విలాస్
సాధించిన కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్, అమ్మన్యూస్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా అల్లూరి అశోక్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ గా సావాపూర్ విలాస్ లు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత కమిటీ
రద్దు కావడంతో చాలా రోజులుగా ఈ నామినేటెడ్ పదవీ కోసం ఆశావహులు తీవ్రంగా పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన అల్లూరి అశోక్‌రెడ్డినే ఆ పదవి వరించింది.
కష్టపడి పని చేసే వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందన్న కంది శ్రీనివాసరెడ్డి మాటలు మరోసారి రుజువయ్యాయి. ఛైర్మన్ గా అల్లూరి అశోక్‌రెడ్డి, వైస్ చైర్మెన్‌గా సావాపూర్ విలాస్‌లతో పాటు సభ్యులుగా బాస సంతోష్, నిమ్మల ప్రభాకర్, సాదలి రామన్న, నరకట్ల స్వామి, మడావి చంద్రకాంత్, గౌర్‌కర్ సీతారాం, తుడుం రాములు, షేక్ మహమూద్, దూమల ఆశక్క, యెల్మా రాంరెడ్డి, విక్రాంత్‌కుమార్ కేతన్, తునికివార్ రాజన్నలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కంది శ్రీనివాసరెడ్డి కృషి ఫలించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు ఇందుకోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు వారంతా ధన్యవాదాలు తెలియజేశారు.