అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట వద్ద బోల్తా పడింది. అయితే సమయానికి కారులోని సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది.
రవికుమార్ ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.