ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేశారు. తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. మే 24కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదిన కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో ఏప్రిల్ 11వ తేదిన సీఐడీ ఆమెను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉంటున్నారు. ఇక లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.