AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశం పరువుతీసిన అదానీ, మోదీ.. ‘చలో రాజ్‌భవన్‌’లో రోడ్డుపై బైఠాయించి సీఎం నిరసన

– వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితిని తెచ్చారు
– వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్‌ కుటుంబానికి భయం..
– బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టులను తప్పించుకుంటున్నారు..
– సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌

అదానీ – ప్రధాని కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్‌ అల్లర్లపై తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌ భవన్‌ కు ర్యాలీగా వెళ్లారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్‌ స్టాండ్‌ ఏమిటో చెప్పాలి..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా డిమాండ్‌ కోసం నిరసన తెలపడం, చట్ట సభలను స్తంభింపజేయడం చేస్తాం. ఎన్ని నిరసనలు చేసినా మోదీ దిగిరావడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్‌ భవన్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. దేశం కోసం రోడ్డెక్కుతాం.. చట్ట సభల్లో నిరసన తెలియజేస్తాం. బీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి నిరసన ఎలా చేస్తారు అంటున్నారు. నేను చేయను.. మరి మీరు చేయండి. అదానీ విషయంలో కేసీఆర్‌ స్టాండ్‌ ఏమిటో చెప్పాలి. బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వైపా..? అదానీ– ప్రధాని వైపా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు చెప్పాలి’ అంటూ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్‌ కుటుంబం భయపడుతుందని ఎద్దేవా చేశారు.

దేశ ప్రతిష్టను దెబ్బతీశారు..
‘ప్రధాని, అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలని అనే పరిస్థితిని తెచ్చారు. అదానీ – ప్రధాని కలిసి దేశం పరువు తీశారని రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. అదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడటం లేదు.ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్‌ వద్ద ధర్నా చేస్తాం అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10