AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డిగ్రీ బాలిక మెడలో తాళి కట్టిన యువకుడు.. పోక్సో కేసు కింద అరెస్టు

డిగ్రీ చదువుతున్న బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అల్లగడపకు చెందిన 26 ఏళ్ల ఓ యువకుడు హైదరాబాద్‌లో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక కొన్ని నెలల కిందట కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మెదటి సంవత్సరంలో చేరి హాస్టల్‌లో ఉంటోంది. ఆ యువకుడు తరచూ కోఠి ఉమెన్స్ కాలేజీ వద్దకు వచ్చి ఆ బాలికను కలిసేవాడు. ఈ క్రమంలో నవంబర్ 2న ఆ బాలికను తీసుకొని వెళ్లిపోయాడు.

విద్యార్థిని హాస్టల్‌కు తిరిగిరాకపోవడంతో సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో తమ కుమార్తె మిస్సయ్యిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సదరు యువకుడు ఆ బాలికతో కలిసి చాదర్ ఘాట్ చౌరస్తాలో ఉండగా.. పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని ప్రశ్నించగా.. ఆ అమ్మాయి తాను ఒకర్నొకరం ఇష్టపడ్డామని, నవంబర్ 3న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఇరువురం పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకొని, లైంగిక దాడికి పాల్పడటంతో యువకుడు వంశీపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10