AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ ముగ్గురు ఐఏఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ప్రస్తత కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. మాజీ సీఎస్ ఐఏఎస్ సోమేశ్​కుమార్​, అర్వింద్​కుమార్, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్​ కుమార్​ చిక్కుల్లో పడ్డారు. ముగ్గురు చుట్టూ మూడు కేసులు చుట్టుకున్నాయి. జీఎస్టీ స్కామ్ కేసులో సోమేశ్​కుమార్​, ఫార్ములా  ఈ–రేస్​ అక్రమాల కేసులో అర్వింద్​ కుమార్, రంగారెడ్డి జిల్లాలోని భూ స్కాముల కేసులో అమోయ్​ కుమార్​ విచారణను ఎదురుకుంటున్నారు.

రూ.1000 కోట్ల స్కామ్…

తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో సుమారు రూ. 1000 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ లో వెల్లడైంది. కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తో పాటు పలువురి పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమర్షియల్‌ టాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ , డిప్యూటీ కమిషన్లర పై కేసు నమోదు అయ్యింది. నిందితులపై 406, 409, 120 (బి) ఐటీ చట్టం కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ కేసును ఈడీ తీసుకుంది. దీనిపై విచారణను వేగవంతం చేసింది. ఏ క్షణమైన వీరిని అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

కేటీఆర్ చెప్పాడని…

2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేసులో అర్వింద్​ కుమార్ కు ఏసీబీ అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆయనను పలుమార్లు విచారణ చేపట్టగా.. అంత ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పడం వల్లే రూ.55 కోట్లు దారి మళ్లించినట్లు ఏసీబీ అధికారులకు జవాబు చెప్పారు. కాగా ఈ ఆనాడు చేపట్టిన ఈ రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రి గా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల  2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు ఇవ్వడంపై అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టింది. కాగా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

42 ఎకరాలు స్వాహా…

ఐఏఎస్ అధికారి అమోయ్‌‌ కుమార్‌‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. కాగా భూదాన్‌‌కు చెందిన సర్వే నంబర్ 181లో 50 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండేది. ఈ భూమికి తమది అంటూ.. ఆ భూమికి వారసురాలిని తాను అంటూ గతంలో ఖాదురున్నీసా బేగం అనే ముస్లిం మహిళ సక్సేషన్‌‌కు దరఖాస్తు చేసుకుంది. కాగా ఈ భూమిని  2021లో ఆమె పేరున వివాదాస్పద భూమి రిజిస్టర్  చేశారు అధికారులు. కాగా ఈ కేసులో ఇప్పటికే అమోయ్‌‌ కుమార్‌‌ ను ఈడీ విచారించింది. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రుల హస్తం కూడా ఉన్నట్లు ఈడీ అధికారుల విచారణలో బయటకు వచ్చినట్లు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10