AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒక న్యూఇయర్ గిఫ్ట్, ఒక సంక్రాంతి కానుక.. కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేద ప్రజలు ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు రాక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకున్న నిరుపేదల కుటుంబాలతో వేరుపడినవారు ఇప్పటివరకు రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు కోసం నిరీక్షిస్తున్నారు.

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యం, సరుకుల కోసం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అమలవుతున్న అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో రేషన్ కార్డు లేని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రేషన్ కార్డుల మంజూరు పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో ప్రకటన చేశారు.

సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడతామని పేర్కొన్న మంత్రి సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని తెలిపారు. ఇక రేషన్ కార్డులను మంజూరు చేసే విషయంపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్టు ఆయన పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం మాత్రమే కాకుండా సన్న బియ్యం కూడా ఇస్తామని మంత్రి శాసనమండలి వేదికగా ప్రకటన చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10