AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దండుమైలారంలో పరువు హత్య.. ప్రేమించినందుకు కూతురును కొట్టిచంపిన తల్లి

తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌ పరిధిలోని దండుమైలారం గ్రామంలో కొన్ని రోజులుగా భార్గవి, అదే గ్రామానికి చెందిన శశి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు మందలించారు. అయినా.. యువతిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు జంగమ్మ, ఐలయ్య తీవ్రమైన కోపంతో ఉన్నారు.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం శశి యువతి ఇంటికి వచ్చాడు. దీంతో జంగమ్మ కోపోద్రిక్తురాలై భార్గవిపై దాడిచేసింది. అంతేకాదు.. చీరతో ఇంట్లోనే ఉరేసి హతమార్చినట్టు స్థానికులు ఆరోపించారు. తన చెల్లి భార్గవిని తమ తల్లి జంగమ్మ హత్యచేసిందంటూ మృతురాలి సోదరుడు చరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు జంగమ్మపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10