కూకట్‌పల్లి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్(Devi Nagar)లో భవనం పైనుంచి పడి ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో శేఖర్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సీఐ శేఖర్.. దేవినగర్‌లోని తన ఇంటికి స్నేహితులను ఆహ్వానించారు.
ఈ పార్టీకి 30మంది రాగా అందులో 10మంది పోలుసులు ఉన్నారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తూ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో జన్మదిన వేడుకలు కాస్త విషాదంగా ముగిశాయి. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.