AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తోకతో జన్మించిన చిన్నారి..!

తాజాగా చైనా దేశంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. 9 నెలలు నిండిన ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే బయటికి వచ్చిన బిడ్డను చూసి వైద్యులు ఒకింత షాక్ అయ్యారు. మామూలుగా కొంతమంది శిశువుల్లో జన్యుపరమైన లోపల వల్ల జన్మిస్తారు. అచ్చం అలాంటిదే చైనాలో జరుగగా ఓ మహిళకు మాత్రం ఏకంగా తోక ఉన్న పాప జన్మించింది.

అందరిలాగే గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసిన తర్వాత పసికందును పరిశీలించిన వైద్యులు పాపకి తోక ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ తోక చిన్నారి వెనుక వైపున మీకు కింది భాగంలో ఉంది. ఈ తోక 3.9 అంగుళాలు అంటే 10 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇక ఈ పాపకు అసంపూర్ణమైన క్షీణత వల్ల తోక వచ్చినట్లు వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాత్రం పాప తోకను తొలగించాలని వైద్యులను కోరారు. కాకపోతే ఆ తోక పాప నాడివ్యవస్థతో అనుసంధానమై ఉందని వైద్యులు తెలిపారు. అలా నాడివ్యవస్థతో అనుసంధానమై ఉన్న దానిని తొలగించడం మంచిది కాదని వైద్యులు సూచించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఏం చేయలేక తోకను అలాగే ఉంచేశారు. అచ్చం ఇలాంటి కేసు ఇదివరకు అమెరికాలో కూడా నమోదయింది. ప్రస్తుతం ఈ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10